రామచంద్ర శతకము
(ప్రణీతము: పోచిరాజు కామేశ్వర రావు.)
ముందు మాట:
“రఘుకులాబ్ధిచంద్ర! రామచంద్ర!” మకుటము నెంచుకొని శతకము వ్రాసితిని. ఆత్మీయత, చనువుతో ముచ్చటించుచు నార్తిగా వేడుకొనుచు శతక
పద్య రచన సాగుతుంది. ఇందు ప్రస్తావించిన విషయములకు శ్రీ వాల్మీకి రామాయణము
ప్రామాణికము. ఇందు కొన్ని పద్యములు రామాయణ శ్లోకముల కాంధ్రీకరణము చేసి వ్రాసితిని.
ఈ కృతి లోని యొప్పులను సహృదయముతో గ్రహించి తప్పులున్న మన్నించి తెలుపఁ గోరెదను.
శ్రీరామ కరుణా కటాక్ష ప్రాప్తి రస్తు!
బుధజన విధేయుడు
కామేశ్వర రావు, M.Tech.(Machine Design)
రాయపూర్
22 Oct. 2015
-*-
శ్రీకర కరుణా విశేష!
సుజనపాల!
దశరధ తనయ! భరతప్రియ! జన
కసుత హృద్విహార!
ఖరవిదార! వరద!
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర! 1.
శేష తల్ప శీఘ్ర శివచాప
భంజన
గాధి జోరు యాగ ఘాతి ఘాత
భువన పాల పుణ్య పురుష
పరంధామ
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర! 2.
రావణాది దుష్ట రాక్షస
సంహార
సకల సురవరగణ సన్నుత భవ
సాగర పరిరక్ష సత్య పరాక్రమ
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర! 3.
నరవరా సకల గుణాభి రామ
భువన
సార్వ భౌమ ఘన విశాలహృదయ
రఘుకుల తిలక రతిరాజ
సమప్రభ
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర! 4.
గాధిజవర శిష్య కాకుత్స్థ వంశ వ
ర్ధన విపిన విహార ధరణి
జేశ
యమివరగణ వినుత హర్యృక్ష
గణనాథ
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
5.
(యమి = ముని)
ధరిణిజప్రియసఖ తాటకసంహార
దుష్ట వాలి హంత
దురితదూర
వారిద నిభ దేహ పాకారి
సన్నుత
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర! 6.
పట్టు విడుపులు గురి
పదనుల నొప్పారు
నాటి యస్త్ర తతు
లనవరతంబు
నరయ గలమె నేఁటి
యణ్వాయుధంబుల
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర! 7.
గగన గమన పుష్పక మలఁ
బుక్కిట పురా
ణంబ గాలి నెగుర నమ్మ
లేదు
“రైటు” సోదరులిట రయమునఁ జూపరే
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
8.
(Wright
brothers – Inventors of aero
plane.)
విశ్వమెల్ల నమరు విష్ణు
గర్భంబున
వృక్ష తత్వ మెల్ల
విత్తున వలెఁ
గన్నదౌను మిథ్య కాననిది
నిజము
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర! 9.
పిండ భేదనమునఁ బిండ శకలములై
పరఁగె; నొక్క వింత పటపుఁ జిన్ని
చుక్క చిత్ర మెల్లఁ
జూపు చందంబున
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
10.
[వింత పటము = హోలోగ్రామ్
(Hologram)]; కశ్యపుని
భార్య దితి గర్భస్థ
పిండాన్ని(ఇంద్ర వధ కోసము) ఇంద్రుడు
ఖడ్గము తో ముక్కలుగా
నరుకుతాడు. అవి 49 (7x7) ముక్క
లవుతాయి. అవి ఒక్కక్కటి
ఒక్కొక్క
శిశువు అవుతాయి. వారే
మరుద్గణాలు.]
శేష శయన తోష సీతామనోభి
రా
మ ఘన బాహు విక్రమ
కమలాక్ష
కామి తార్ధ దాత కారుణ్య
విగ్రహ
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర! 11.
సీత నపహరించి చెడె దశకంఠుఁడు
రామ వధ్యుఁ గావఁ ద్రాత లెవరు?
దౌష్ట్య బుద్దు లవని దైవోపహతులయ్య
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
12.
రత్న ధన మ ణీతరమ్ముల
దివ్యాంబ
రంబులఁ గనకాభరణ సమేత
సీత నిమ్మన దశశిరుఁ
డనుజుఁ వినఁడు
రఘుకులాబ్ధిచంద్ర! రామచంద్ర!
13.
గాజు గొట్టమందు ఘనముగఁ బిండాభి
వృద్ధి నేఁటి శాస్త్ర
వింత కుంభ
సంభ వుండగస్త్య సంయమి
యలనాఁడు
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
14.
నాణ్యముగఁ ద్రిశంకు నాకంబున నపుడు
నిలిపె కౌశికుండు నేఁడు
సను న
హర్నిశము లుప గ్రహంబులు
నింగినిన్
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
15.
యోగ దృష్టిఁ గనిరి
యోగులు ఋషులును
స్థిరముగ నొక యెడనె చేత లన్ని
దూరదర్శి నేఁటి
దూరశ్రవణు లనన్
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
16.
తాటక నఁట నీవు తగఁ
గూల్చితివి గద
వెలఁది పూతన నఁట వెన్న
దొంగ
దుష్ట శిక్ష కాది
దుర్వనితలె చుమ్మి
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
17.
తోయధి తెరు వేల
దుస్సాధ్యమే నీకు
నీదు లీల గాక నీరజాక్ష
చేయ లేదె నీవు శివ చాప
భంగంబు
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
18.
చనఁగఁ దినము లయిదు
శతయోజ నమ్ముల
సేతు వమరె నాడు శీత వనధి
భూ సురంగపు గతి పొనరారె నేఁ డిటన్
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
19.
[శీత వనధి భూసురంగపు గతి : ఇంగ్లీష్ చాన్నెల్
లోని చాన్నెల్ టన్నెల్]
భస్మశయ్య వాయు భక్షిణి
తాపసి
భర్తృ శాప తప్త భామ రాదు
కనఁగ గౌతమ సతిఁ గాచితివి
గృపను
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
20.
[గౌతమ మహర్షి భార్య యహల్యను
నిరాహారిగ వాయు భక్షిణిగ భస్మ
శాయినిగఁ దపించుచు నందఱికి నదృశ్యరాలుగ వేల సంవత్సరాలు,
శ్రీ రాముఁ డక్కడికి
వచ్చి యాతిథ్యము స్వీకరించు నంత వరకు,
నుండుమని శపించెను. ఆధారము:
వాల్మీకి రామాయణము]
దర్శనమున నీదు తనువును
బడసె న
హల్య దుర్నిరీక్ష యంత
దనుకఁ
గల్మషమ్ము బోవఁ గలసెఁ బతినిఁ దమిన్
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
21.
ఖరులు ఘాతుకులట ఖర
దూషణాదులు
మునులకు నితరులకు
ముప్పు సేయ
జనపదమున వేగ
సమయించితివి గద
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
22.
జనపదము : జనస్థానము
(దండకారణ్యములో)
రక్కసుల నతి బలులఁ జతుర్దశ సహస్ర
సంఖ్యుల నని లీల
సంహరింప
వనచరులు మునులకు వంత
తీరెఁ గదయ్య
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
23.
జీవ రాసు లన్నిచెప్పఁ గర్మవశులు
జన్మములను మనుజ జన్మ మరుదు
సుమ్ము మోక్ష గతులు సూడఁ దరుణ మయ్య
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
24.
చాప మధ్య తటినిఁ జక్కఁగఁ
బట్టి సం
ధించి నారి లాగ దిగ్గన నది
భంగ మయ్యె నేమి
బాహువిక్రమ మయ్య
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
25.
జామ దగ్ని విష్ణు
చాపంబు నెక్కిడ
నీయ రోష మలర నెక్కిడంగ
ధనువు నంత నతని దర్ప మణగెఁ గద
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
26.
రణపిపాసి పరశు రాము
ద్విజుని గాధి
జు కతన వధ సేయఁ జొరవ
కాదు
గమనము తపముల నొకటి కోరు
మంటివే
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
27.
(చొరవ : బుద్ది కుశలత)
ధరణిఁ గశ్యపునకు దానమిచ్చెను
గాన
యామినిఁ జనవలె మహేంద్ర
గిరికి
జామదగ్ని దనదు జప
ఫలమును వీడె
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
28.
అది యయోధ్య యైన
యజ్నవాటిక యైనఁ
గారడవియు నైన నారయ మిధి
లయగు లంకయగు సలక్ష్మణుఁడవు
సుమ్ము
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
29.
మిత్రుఁ బగిది నీకు మేటి
సుద్దు నుడివె
సేవకుం డనంగ సేవఁ జేసె
సానుభూతి సూపె ననుజుండు గురుభంగి
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
30.
హవపు నెపమున సకలాస్త్ర శస్త్ర
పరిపూ
ర్ణులుగఁ జేసె మిమ్ము
రుచిర ధర్మ
రతుఁడు కౌశికుండు రావణ
వధ నెంచి
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
31.
మానవాస్త్ర మహిమ
మారీచుఁ బఱప నా
గ్నేయమున సుబాహు నిహతుఁ
జేయ
మారుతాస్త్ర హతులు
మనుజాశనులు గాదె
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
32.
చక్కనైన రూపు చల మసూయలు
లేవు
గురు సముండ వయ్య గుణము
లెంచ
ననుపమ సుతుఁడ విల నరయ
వీరుఁడ వీవు
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
33.
చిత్త మందు శాంతి
చిలికెద వెప్పుడు
కుసుమ సదృశ వాక్కులు సుమి
నీవి
పరుషపుఁ బలుకులకుఁ బదులాడ నేరవు
రఘుకులాబ్ధిచంద్ర! రామచంద్ర!
34.
మిక్కిలి ముద మంట
మేలొక్క టొనరింప
వంద కీడు లైన వాని మఱచు
హృదయ మయ్య నీది
యిక్ష్వాకు వర్ధన
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
35.
జ్ఞాన వృద్ధ వృద్ధజన
శీలవృద్ధుల
సజ్జనుల మఱవవు
సంప్రదింప
నస్త్ర యోగ సమయ మందుఁ
గూడ నెపుడు
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
36.
సూక్ష్మదర్శి వయ్య
సూక్తులు మధురము
ప్రధమ భాషి వయ్య
పలికెదవు ప్రి
యములు వీరవరుఁడ వైన
నిగర్వివి
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర! 37.
అనృత మాడవు ప్రజ
లనురక్తు లఁట నీకు
సకల శాస్త్ర తతులు
సదివి తీవు
గురు వినయుఁడవు
జనకూర్మిఁ బడసి తీవు
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
38.
ధర్మవేది వినుత
దాక్షిణ్య జితరోష
దీన దుఃఖ చలిత ధీర
చిత్త
విమల చరిత నిత్య విప్ర వర
విధేయ
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
39.
పావన తర మైన
వంశానుగతివి నీ
క్షాత్ర ధర్మ విధుల
గారవింప
నమర లోక ఫలము యశము
నిక్క మనవె
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
40.
ఫలము లేని యట్టి పనుల నిందల
నిష్ట
పడవు విద్య లందుఁ బట్టు మిన్న
భాషణ చతురుడవు వక్తవు గురు భంగి
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
41.
యవ్వనమ్ము సుంద రాకృతి
యారోగ్య
మతిశయిల్లు వక్త వరయ
సుజన
దేశ కాల వేది తీర్థకరుఁడ
వయ్య
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
42.
గుణము లందు మేటి
కుంభినీశ తనయ
పౌరులకును బ్రీతి పాత్రుడవు మ
హి నరయగఁ గదలు
బహిర్ప్రాణ మే గద
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
43.
పుణ్య గురువుల దయ
పూరించి విద్యా వ్ర
తమ్ము వింటి విద్యఁ
దండ్రి మించి
యరసితివి కదయ్య సాంగ వేదములను
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
44.
సత్కులాభి జాత సాధుచరిత
ధీర
నిత్య సత్య వచన
నిష్కపటి వ
ధర్వ శిక్షి తుఁడవు
ధర్మార్ధ వేదుల
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
45.
(అధర్వులు =
బ్రాహ్మణులు)
ధారణ మధికంబు
ధర్మార్ధకామ త
త్వజ్న వివిధ సంప్రదాయ
కార్య
పాలనా రతుఁడవు ప్రతిభాన
శేఖరా
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
46.
పెక్కు హితులు పట్టు విడుపుల నేర్పరి
వయ్య యిల నమోఘ హర్షరోష
గుప్త మంతన సునిగూఢ భావ
నిగర్వి
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
47.
తుచ్ఛముల విడుతువు
దుర్భాష లాడవు
స్వపర దోష వేది వప్రమత్త
భక్తి దృఢము మేటి
ప్రజ్ఞ సోమరి గావు
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
48.
శాస్త్ర వేద సహిత సదమల జ్ఞానివి
యరయ గలవు జన
గుణాంతరమ్ము
శిక్ష రక్షణ లిడ
శిక్షితుండవు గాదె
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
49.
చేరఁదీయుదు గుణ శీలురఁ
బ్రోవగ
నిగ్రహింపఁ గలవు నేరగాళ్ల
నరయ గలవు రీతు లాయ వ్యయమ్ములన్
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
50.
అలస భావ మెఱుఁగ వర్ధ ధర్మంబుల
నెఱపి సౌఖ్యములఁ దనియుదు వయ్య
కౌశల మధికము సకల
శాస్త్ర తతు లందు
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర! 51.
కీర్తి యలరు ధన వికేంద్రీకరణ వేది,
వేడుకపుఁ గళలు సువిదితము లవి,
యశ్వ వారణ విన యారోహ పారగ
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
52.
సన్నుతాతిరధ, సశాస్త్ర ధనుర్వేద
పార గాభియాత పరవరప్ర
హార సైన్య పాలనాధ్యక్ష
శేఖరా
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
53.
చణ్డ దేవ దనుజ
సమరాప్రధృష్య, మ
త్సర రహిత, విశేష దర్ప హార,
నావమానిత సుజనాళి, కాలావశ
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర! 54.
క్షమను వసుధ వజ్రి శౌర్యమున
బృహస్ప
తిసదృశుడవు ప్రతిభఁ ద్రిజగ సమ్మ
తి గుణ వర గణములఁ
దేటతెల్లం బయ్యె
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర! 55.
పృధివిఁ బ్రాణి కోటి పెంపునాశింతువు
సర్వ భూత తతుల జాలి
గలదు
వసుధ వృష్టి నొసఁగు
పర్జన్యు చందంబు
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
56.
సత్పురుషుఁడవు గన
జగతిని, సత్యధ
ర్మానురక్త, భాగ్య లాభ సహిత
ధర్మ సంచయాభి దాయక, సన్నుత
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
57.
ద్వేష గుణరహిత
జితేంద్రియ సచ్చీల
సహనశీలి సత్య సంధ సౌమ్య
సాంత్వనా! కృతజ్ఞ శాస్త్రజ్ఞ
ధర్మజ్ఞ
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
58.
శ్లాఘనీయ బుద్ధి సత్కుల
సంజాత
మలిన మన నెఱుఁగని
మానసము జ
గమున మేటి వయ్య గాంధర్వ
విద్యల
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
59.
గ్రామ నగర తతులఁ గావఁగ
సౌమిత్రి
తోడఁ గదలి పోరి దుష్ట శత్రు
వుల జయించి కాని పో నేర విద్ధర
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
60.
ప్రజలు దుఃఖ మందఁ బరితప్తుఁ డౌదువు
సాను భూతు లిడవె సరళ
రీతి
గురుని భంగి పండుగుల సంతసిల్లవే
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర! 61.
రుచిర సరళ భృకుట లోకాభిరామ
వి
శాల తామ్ర నయన శౌర్య
వీర్య
పౌరుషమ్ములందుఁ బరమాత్ముఁడవు గాదె
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర! 62.
ప్రీతి పఱచు వాని విత్తవంతు నొనర్తు
చక్కదనము ప్రేమ శాంత
గుణము
ల వెలుఁగవె సహస్రరశ్మి నిభమ్ముగ
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
63.
మాటున మృగ హింస మర్యాద
నిక్కంబు
భ్రాత దార హారి వాలి ధర్మ
హీనుని విదళింప హీన మనఁ
దగునే
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర! 64.
సకల జన హితుండు సర్వ
సద్గుణ రాశి
కాత్మజునకుఁ బ్రీతి యౌవ రాజ్య
పట్ట మింక గట్టఁ బల్కె
దశరధుండు
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
65.
దాన మిచ్చి యింక
దైన్యుని గెల్తువు
రిపుని నాజి గురు
వరేణ్యు సేవ
వింటి వీరు నిఁక భువిని
సత్యము వలనన్
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
66.
రామ యన్న పిదప రాక మాట
పరిత
ప్త హృదయుండు దీన
పార్థివేంద్రుఁ
డంత గహన మేఁగు మంచు
నెట్లు నుడువు
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర! 67.
రాజ శాసనమున రగులు
నగ్నిఁ బడనె
విషముఁ ద్రావ కడలి వేగ
దూక
సిద్ధ మనవె గురు సచివ జనకు లగుటన్
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
68.
వరము లిచ్చె నాకు
వసుధేంద్రుఁ డని కైక
సత్య సంధుఁ జేయఁ జాగు మనియె
వనము పురము వీడి పదు
నాల్గు వర్షముల్
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
69.
ధర్మరక్ష, వేద తతులు మరియు ముక్తి
పథము సత్య మదియె బ్రహ్మ
మనుచుఁ
గైక తద్విరుద్ధ కాంక్ష
లడుగ లేదె
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
70.
రాము వదలి భరత
రాజ్యాభిషేకము
సప్త సప్త వర్ష జటిల వన
ని
వాస శిక్ష రామ భద్రున
కెటు లొప్పు
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
71.
రక్క సగుట వింత రామాను
రక్తి కై
క పతి యన్నఁ బ్రేమ గలదు మరి స
పత్ని దాస్య భీతి భార మగుట
నేమొ
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
72.
కలత మోము వానిఁ గైకేయ
వర బద్ధు
శోక తప్తుఁ దండ్రిఁ
జూచి వైన
మెఱిగి కారడవుల కేఁగి
నాఁడవు కాదె
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర! 73.
మంధర కుటిలంపు
మంతనమ్ములు దశ
రధ వరములు కైక
లౌక్యములును
దానవేంద్ర వధకు
దైవసంకల్పముల్
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
74.
సత్యమార్జవమ్ము శౌచము
త్యాగము
తపము గురు సపర్య దాన
గుణము
విద్య సౌహృదమ్ము వింత
నీ సొత్తులే
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
75.
(ఆర్జవము = ఋజుభావము)
హస్తి విభవ గమన, హర్యక్ష నిభవక్ష,
వికసిత వదనారవింద
నిన్ను
గాంచి శూర్ఫణఖ
వికారమొందెను గదా
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర! 76.
రాజ సభనుఁ బలికె రామాభి
షేకము
వరము లిచ్చి కోరఁ బాఱఁ దగదు
దశరధునకు నకట ధర్మ
సంక్లిష్టమే
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
77.
వనికి నేఁగఁ దండ్రి
బలుకఁడు తన నోటఁ
గైక మాట వేగ గారవించి
సత్య వంతుఁ జేయఁ జన లేదె
వన మీవు
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర! 78.
తల్లి, తండ్రి, భ్రాత, తనయుఁడు, కోడలు
స్వీయ కర్మ వశులు సీత
దలఁచె
భర్తృ కర్మ భోక్త భార్య
యొకతె యంచు
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
79.
నాథుఁ డొక్కఁడ గతి నారీమణుల కిహ
పరము లందు సుతులు ప్రాణ సఖులు
తల్లి తండ్రి కడకుఁ దానుఁ గా నేరరు
రఘుకులాబ్ధిచంద్ర! రామచంద్ర! 80.
తీఁగ లేక వీణ తీయఁగఁ
బల్కునే
చక్ర హీన రధము సనునె చెపుమ
పతిఁ గనని శత సుత వనిత
కేది సుఖము
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర! 81.
తల్లి దండ్రు లైన
దనయులు నైన ని
చ్చునది మితము గాదె చూడ
నమిత
దాత పతి యొకండె దార
పూజింపదే
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
82.
ప్రాణ సముని శిక్ష పంచు
కొనియె సీత
పడతి యూర్మిల తన భర్త
భ్రాతృ
సేవ కడ్డ మనుచుఁ జేరదు
వనమును
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
83.
రాము దశరథునిగ రమణి సీతను దల్లి
యనఁగ వన మయోధ్య యనగ మదినిఁ
దలఁపు లక్ష్మణ యనెఁ
దల్లి సుమిత్రయే
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
84.
మేఘనాద బాహు విగళిత నాగాస్త్ర
బద్ధ రాఘవు లటఁ బక్షిరాజ
ముక్త బంధు లైరి ముద మంద
కపివరుల్
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
85.
మేఘనాదుఁ డప్రమేయ మాయా రణ
కోవిదుఁడు సురాంతకుండు
ధన్వి
నింద్రజిత్తుని
వధియించెనా సౌమిత్రి
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర! 86.
శర శిఖాభిఘాత సంతప్త
గాత్రుని
భగ్నరధుని దీనవదను దాన
వేంద్రు సమర నీతి నీక్షించి గావవే
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
87.
(శ్రీ రాముడు మారుతి భుజ
స్కంధముల మీద గూర్చుని
యుద్దము చేసెను.)
ఒక్క శిరముఁ ద్రుంప
నొండొక్క శిర మూనె
మాతలి యెఱిగింప మర్మ మెల్ల
రావణుండు ఘోర
బ్రహ్మాస్త్ర హతుఁ డయ్య
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
88.
(మాతలి, సురరాజ సారథి, రామునికి సారధ్యము సేయుచు
గుర్తు
చేసెను బ్రహ్మాస్త్రమున
గాని రావణుఁడు మరణింపఁడని.
- శ్రీ వాల్మీకి రామాయణము.)
పతి వియోగ శోక పరితప్త
తార స
హగమ నేచ్చ నాపి యౌవ
రాజ్య
పదవి నిచ్చి తృప్తిఁ
బఱచితి వంగదున్
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
89.
మారుతి హితములను మారీచు
పల్కుల
నా విభీష ణోక్తు లౌర
కుంభ
కర్ణ సూక్తుల దశకంఠుఁడు
వినఁ డాయె
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర! 90.
ఐంద్ర మారుతాస్త్ర హత శిర
హస్తము
లర్ధ చంద్ర బాణ హత పద యుగ
గళముల మరణించె ఘన కుంభకర్ణుఁడు
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర! 91.
బ్రహ్మవంశ భవుఁడు
రణకోవిదుఁడు శివ
భక్త వరుఁడును దశ వదనుఁడు
పర
కాంత వెంట నంటెఁ గాలవశుం డయి
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
92.
తేరు నిలుపు మంచు దీన
నృపతి రాఁగ
నశ్రుత మని చెప్పు మంటివి
చిర
దుఃఖ మఘకర మని దోషము నెంచవే
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
93.
నార చీర లవి జనక సుతకుఁ
దగవు
వర వృతమ్ము గాదు పరమ సాధ్వి
వస్త్ర భూషణార్హ
వాశిష్ట్య మతమునన్
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర! 94.
చన నడవి సుతుండు, శాత్రవ సింహుండు
ధీర చిత్తుఁడు వసుధేశుఁ
డకట
క్షితిఁ బడి పలుమారు క్షితిపతి
రోదించె
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
95.
ధరణిఁ గూల భర్త, దరిఁ జేర, నో కుల
పాంసని! నను దాఁక వలదు కైక
ముఖము సూడ నని విముఖుఁ డయ్యె
భూపతి
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
96.
అవని నాథుఁ డనియె
నాత్మహితైక కాం
క్షిణివి కైక నీదు సేవకులను,
ద్యక్త ధర్మ, నిన్ను దక్కు చుంటిని వేగ
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
97.
అబ్జ భవుఁడు నైన నంబికా
వరుఁ డైన
నింద్రుఁడు సురపతి
మహేంద్రుఁ డైన
రామ వధ్యు నాజి రక్షింప నేర్తురే
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
98.
దేవ నాగ యక్ష దితి సుత
గంధర్వ
నైరృతాదుల రఘు నందను
గని
సమర మందు నిలువ శక్యంబె
యేరికిన్
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
99.
లంక యందు హనుమ రక్కసు లెనుబది
వేల మూఁక మట్టు వెట్టి యక్ష
సహిత మంత్రి సుతుల
సమయించె నవలీల
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
100.
దూతఁ జంపఁ దగదు దోష
భూయిష్ఠము
రాజ నీతి నిలుపు
రాక్షసేంద్ర
వేఱు శిక్ష గన విభీషణుఁడు పలికె
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
101.
తాపసియు పతివ్రతయు రామ
సందర్శ
నాభి లాష నైన హనుమ
వహ్ని
శీత లమ్మగు నని సీత వేఁడె
ననలు
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
102.
లలన వత్తురింక లంకకు
రామ ల
క్ష్మణులు బంధు మిత్ర
సపరివార
రావణ వధ జరుగ రామ లాలిత
వీవు
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
103.
దశసహస్రవర్ష దశ
శతాబ్దములు రా
జ్యమ్ము నేలితివి
ప్రజామనోర
థముల నెఱిఁగి ప్రీతిఁ
దామరస నయనా
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
104.
చోర రహిత మయ్య చూఱకొనరు
బాల
పాటు లెఱుఁగ రయ్య బడుగు
జనులు
కాన రారు జగతిఁ గాకుత్స్థ పాలనన్
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
(చూఱకొనరు =
కొల్లగొట్టరు)
105.
సంతత ఫలపుష్ప
శాఖానగమ్ములు
స్కంధ ఘనము లచటఁ గాల
వర్ష
ములు సుఖానిలమును
మురిపెంపు రాజ్యము
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర! 106.
కనగఁ బ్రజలు స్వీయ కర్మానురక్తులు
లోభ వర్జితులును లుబ్ధ
యశులు
ధర్మ పరులు రామ తత్పరు లవనీశ
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర! 107.
రామ జగదభి నుత రామ
భార్గవ సువి
రామ సంతత జప నామ రామ
రామ జానకీ లలామ రామ
పరాత్మ
రఘుకులాబ్ధిచంద్ర!
రామచంద్ర!
108.
ఇది విబుధజన వినత కౌశిక సగోత్రోద్భవ పోచిరాజాన్వయ సత్యసుందరీపేర్రాజదంపతీ సుత
వేంకట రామ లక్ష్మీ సతీ సేవిత కామేశ్వర రావు నామధేయ విరచిత
శ్రీ వాల్మీకి రామాయణ కల్ప వృక్ష ప్రామాణిక
పద్య కుసుమాలంకృత
రామ చంద్ర శతకము.
-*-
|
|
రామ చంద్ర శతకము |
|
గ్రంథ కర్తృ దంపతులు |
వివరములు:
పోచిరాజు కామేశ్వర రావు, M.Tech. (Machine Design)
స్వగ్రామము:
బి. దొడ్డవరము, నగరము మండలము, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.
ఉద్యోగము:
1. Retd. Senior Manager, Electronics Corporation of India Limited (A Govt. of
India Undertaking), Hyderabad.
2. Former Assoc. Professor, Dept. Of Mech. Engg. , M.V.S.R Engineering College
Hyderabad.
3. Former Assoc. Professor, Dept. Of Mech. Engg. , Rungta College of Engineering and Technology, Raipur.
నివాసము: H.No. 19, Shiva Residency, Phase
1, Mathpurena, Raipur, Chchattisghar - 492013
Cell. Nos. 8602787525, 9440378434.
స్వీయ రచనలు:
1.
రామ చంద్ర శతకము.
2.
పోచిరాజ శతకము.
3.
పద్మావతీ శ్రీనివాసము (ద్విపద
కావ్యము- సప్తాశ్వాసములు).
4. వేంకటేశ్వరా శతకము
(అష్టోత్తర శతనామ సంభృతము).
5.
శ్రీమదాంధ్ర సుందర కాండ (నిర్వచన వాల్మీకి
రామాయణానువాదము, 68 సర్గలు).
6.
శ్రీకృష్ణ సూక్తి సుధాకరము
(శ్రీమదాంధ్ర భగవద్గీత, శ్లోక
క్రమానువాదము).
7.
శ్రీమన్నారాయణ శతకము.
8.
శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము (100
దశకములు).
9.
శ్రీమన్నారాయణ దండక సహిత దేవీ మూర్తి త్రయ
స్తోత్ర మాలిక.
10.
మాహేశ్వర దండకము.
11.
మాయా జాలము (అష్టాదశ శంకలు) ఖండిక.
12.
ఉదాహరణ కావ్యము_ దొడ్డవర
సోమేశ్వరుఁడు
13.
శ్రీమదాంధ్ర రామాయణము.
14.
శ్రీ బాల రామాయణము (సంక్షిప్త
రామాయణము) (కొనసాగుచున్నది)
15.
గోవిందము.
